సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (19:03 IST)

చొరబాటుకు యత్నం - శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ ప్రాంతంలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన భద్రతా బలగాలు ఆమెను మట్టుబెట్టాయి. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా కాల్చివేశారు. 
 
సరిహద్దుల ఆవతల నుంచి కొందరు భారత భూభాగంలోని వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి వారు హెచ్చరించారు. అయితే, వారు ఏమాత్రం పట్టించుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించగా, వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి. 
 
కానీ, వారు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి. అయితే, ఉ గ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని భద్రతా బలగాలు వెల్లడించాయి.