గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (10:47 IST)

శ్రీనివాస్ కూచిభోట్ల హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు

హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభోట్ల (33) అమెరికా బార్‌లో ఉండగా.. అమెరికా మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ కేసులో శ్రీనివాస్‌ను హతమార్చిన అమెరికా కోర్టు జీవిత ఖైదు విధ

హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభోట్ల (33) అమెరికా బార్‌లో ఉండగా.. అమెరికా మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ కేసులో శ్రీనివాస్‌ను హతమార్చిన అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. స్నేహితుడితో కలసి బార్‌లో ఉన్న శ్రీనివాస్‌‌పై అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్‌ ప్యురిన్‌ టన్‌(52) కాల్పులు జరిపినట్లు తేల్చడంతో.. కోర్టు జీవిత ఖైదు విధించింది. 
 
శ్రీనివాస్‌‌తో పాటు బార్‌ లో ఉన్న అలోక్‌ మాదసాని గాయాలతో బయటపడ్డారు. వీరిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలట్‌ అనే వ్యక్తికి కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. శ్రీనివాస్‌ హత్యపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2018 జనవరిలో కూచిభొట్ల భార్య సునయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగానికి ఆహ్వానించారు.
 
ఈ వేదికపై నుంచి ట్రంప్‌ కూచిభొట్లపై జరిగిన దాడిని ఖండించారు. ప్యూరింగ్‌ టన్‌ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్‌‌పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆడమ్‌‌కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్‌ భార్య సునయన ఆహ్వానించదగిన విషయమన్నారు.