గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (10:48 IST)

దలైలామా హత్యకు కుట్ర.. చైనా హస్తముందా?

టిబెట్ బౌద్దమత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) గుర్తించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మునీర్ అనే తీవ్రవాదిని ఆగస్టు 7వ తేదీన ఎన్ఐఏ బృందం అరెస్టు చేసి ఈ కుట్రను

టిబెట్ బౌద్దమత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) గుర్తించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మునీర్ అనే తీవ్రవాదిని ఆగస్టు 7వ తేదీన ఎన్ఐఏ బృందం అరెస్టు చేసి ఈ కుట్రను భగ్నం చేసింది. ఈ తీవ్రవాది భారత్‌లో జరిగిన పలు బాంబు పేలుళ్ళ కేసులో కీలక నిందితుడిగా ఉండటం గమనార్హం. పైగా, బంగ్లాదేశ్‌లో పోలీసులు గాలిస్తుండటంతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు.
 
భారత్‌లోని పలు ప్రాంతాల్లో బట్టల వ్యాపారిగా అవతారమెత్తి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి. దలైలామాను హత్య చేసేందుకు కుట్ర పన్నామని మునీర్ తెలిపాడు. ఆయన తరుచూ మైసూర్‌లోని బైలుకుప్పె టిబెటన్ పునరావస కేంద్రానికి వస్తుంటారు. 
 
ఆ సమయంలో హత్యకు ప్లాన్ చేశామని అన్నాడు. దలైలామా హత్య ద్వారా భారత్‌తోపాటు పలు దేశాల్లో చిచ్చు పెట్టాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా అధికారులు భావిస్తున్నారు. 2018 జనవరిలో బీహర్ బుద్దగయాలో బాంబు పెట్టి దలైలామా, బీహర్ గవర్నర్ ఇద్దరినీ ఒకేసారి హత్య చేయడానికి ప్లాన్ వేశామని మునీర్ వెల్లడించారు.