శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:13 IST)

కర్నాటక యువకుడికి అదృష్టం : రూ.23 కోట్ల లాటరీ

కర్నాటక రాష్ట్రానికి చెందిన యువకుడు ఒకడు రాత్రికి రాత్రే కోటీశ్వరు అయిపోయాడు. బంపర్ లాటరీ తగలడంతో నిరుపేదం ముగిసి కోటీశ్వరుడు అయిపోయాడు. 
 
దక్షిణ కన్నడ జిల్లా సుళ్య ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫయాజ్‌(24) అనే యువకుడు ముంబైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఫయాజ్.. తన స్నేహితుడుతో కలిసి లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటు ఉంది. 
 
ఈ క్రమంలో అబుదాబిలో రూ.23.18 కోట్ల(12 మిలియన్‌ దిర్హమ్‌లు) లాటరీ తగిలింది. ఇటీవల అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆన్‌లైన్‌ బిగ్‌ టికెట్‌ రాఫెల్‌ డ్రాలో ఈ అదృష్టం వరించింది. తల్లిదండ్రులను కోల్పోయి ఫయాజ్ కుటుంబ పోషణ నిమిత్తం ముంబైలో పని చేస్తున్నారు. అయితే, ఈ లాటరీ డబ్బుతో ఏం చేయాలో తెలియడం లేదనీ, అసలు దాని గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు.