కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై త్వరలోనే తుది నిర్ణయం : పాక్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (08:48 IST)

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పాకిస్థాన్ ఆర్మీ స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై 46 ఏళ్ల జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించింది. 
 
కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ చీఫ్‌కు అందిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ఏ నిర్ణయం తీసుకునేది త్వరలోనే తెలియపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
 
తనకు విధించిన మరణశిక్షపై జాదవ్ పెట్టుకున్న పిటిషన్‌ను అప్పిలేట్ కోర్టు కొట్టివేయడంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. అక్కడి చట్టాల ప్రకారం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)కు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయన కూడా దానిని కొట్టివేస్తే పాక్ అధ్యక్షుడిని ఆశ్రయించవచ్చు. దీనిపై మరింత చదవండి :  
Kulbhushan Jadhav Mercy Petition Final Stage Pak Army Good News

Loading comments ...

తెలుగు వార్తలు

news

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం ...

news

అక్కడ కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చిన రాధే మా... ఫోటో వైరల్

దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తాజాగా దేశ ...

news

దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేస్తాం.. అమెరికా హెచ్చరిక

ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని అమెరికా మరింతగా ...

news

ఢిల్లీలో ఈసారి నిశ్శ‌బ్ద‌ దీపావళి..? బాణసంచాపై మళ్లీ నిషేధం!

దేశ రాజధాని దిల్లీలో గతేడాది బాణసంచాపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ...