శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (16:18 IST)

రిషి సునక్‌కు షాకిచ్చిన బ్రిటన్ పౌరులు - లిజ్ ట్రస్‌కే ప్రధాని పగ్గాలు!

rishi - liz truss
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో పోటీపడిన భారత సంతతి మూలాలు ఉన్న రిషి సునక్‌కు ఆ దేశ ప్రజాప్రతినిధులు, పౌరులు తేరుకోలేని షాకిచ్చారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ ఎంపికయ్యే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చివరి దశకు చేరుకుంది. 
 
బ్రిటన్ వ్యాప్తంగా గత ఆరు వారాల హస్టింగ్స్ పర్యటనలో, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ వర్సెస్ ట్రస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. వీరిద్దరూ 1,75,000 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల మద్దతు కోసం పోటీపడ్డారు. 
 
ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తదుపరి ప్రధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఇందులో ఆరంభంలో రిషి సునక్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత ఆయన లిజ్ ట్రస్ చేతిలో వెనుకబడిపోయారు.