గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (17:16 IST)

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

Mahinda Rajapaksa
Mahinda Rajapaksa
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్న కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
 
మరోవైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 
 
మహింద రాజపక్స రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
 
విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో ధరలు భారీగా పెరగడంతో ఆహార సంక్షోభం నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 
 
మరోవైపు విద్యుత్‌ కోతలు భారీగా విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించినా.. లెక్క చేయకుండా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
దీంతో సోమవారం ప్రధాని పదవికి మహింద రాజపక్స పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ప్రొఫెసర్‌ చన్నా జయసుమన సైతం రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు.