మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:44 IST)

సెల్ ఫోన్‌ను మింగేశాడు.. నోకియా 3310 మోడల్ కడుపులోకి వెళ్ళేసరికి..?

Cell phone
స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం అందరి జీవితాల్లో భాగంగా నిలిచింది. అయితే ఈ ఫోన్ల ద్వారా ఏర్పడే ప్రమాదాలు కూడా ఎక్కువే వున్నాయి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్లు పేలడం వంటి ఘటనలు వున్నాయి. తాజాగా కొసావో ప్రిస్టిన కోసోవో అనే 33 ఏళ్ల వ్యక్తి సెల్ ఫోన్‌ను మింగేశాడు.

అప్పట్లో వచ్చిన నోకియా 3310 మోడల్ నోకియా ఫోన్‌ను ప్రిస్టిన మింగేశాడు. అయితే సెల్ ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం తెలియదు కానీ. మింగిన తరవాత కడుపు నొప్పి రావడంతో లబో దిబో అంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రిస్టీనా కు డాక్టర్లు స్కానింగ్ తీసి పరిశీలించగా నోకియా ఫోన్ పేగుల్లో ఇరుక్కుంది.
 
వెంటనే ఆపరేషన్ చేసి ఫోన్ భయటకు తీయకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఫోన్ ను బయటకు తీశారు. ఫోన్ ను బయటకు తీసేందుకు డాక్టర్లు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

ఒకవేళ బ్యాటరీ బయటకు వస్తే అందులో ఉండే కెమికల్స్ వల్ల వ్యక్తి ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్లు చెబుతున్నారు. ఇక సమయానికి ఆస్పత్రికి వెళ్ళడం వల్ల క్రిస్టినా బతికి పోయాడు గానీ అతడు ఫోన్ ఎందుకు మింగాడో డాక్టర్లు ఎంతలా ప్రశ్నించినా చెప్పలేదు.