శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 11 జులై 2016 (13:46 IST)

బుల్‌ ఫైట్‌లో ఓటమి ఎరుగని వీరుడు చనిపోయాడు.. ఎలాగంటే?

29 ఏళ్ళ విక్టర్ బారియోకు స్పెయిన్‌లో బుల్ ఫైటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడిని చూస్తే ఎలాంటి పొగరుబోతు బుల్ అయినా అణిగిపోవాల్సిందే. గతంలో ఎన్నోసార్లు బుల్స్‌తో ఫైట్ చేసి విజయాన్నిదక్కించుకున్న

ఏళ్ళ విక్టర్ బారియోకు స్పెయిన్‌లో బుల్ ఫైటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడిని చూస్తే ఎలాంటి పొగరుబోతు బుల్ అయినా అణిగిపోవాల్సిందే. గతంలో ఎన్నోసార్లు బుల్స్‌తో ఫైట్ చేసి విజయాన్నిదక్కించుకున్నాడు. కానీ ఈ సారి కథ అడ్డం తిరిగింది. 
 
ఇటీవల జరిగిన పోరాటంలో విక్టర్ ఓడిపోవడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోయాడు. బుల్ తన పదునైన కొమ్ములతో విక్టర్‌ని ఎత్తి పారేసింది. దీంతో తీవ్ర గాయాలకు గురైన విక్టర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 
 
ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే... స్పెయిన్‌లో గత ముప్పై ఏళ్ళలో ఓ బుల్ ఫైటర్ ఇలా మరణించడం ఇదే మొదటిసారని నిర్వాహకులు అంటున్నారు. బుల్ చేసిన ఘాతుకాన్ని ప్రేక్షకుల్లో ఉండి చూసిన అతని భార్య కన్నీరుమున్నీరైంది. విక్టర్ మృతి పట్ల ప్రధాని మరియానో రజోయ్ తీవ్ర సంతాపం ప్రకటించారు.