Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలోకి జికా మహమ్మారి.. దోమల నిర్మూలనకు గూగుల్, మైక్రోసాఫ్ట్ హైటెక్ టూల్స్

గురువారం, 13 జులై 2017 (15:34 IST)

Widgets Magazine
zika virus 1

బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చిన జికా వైరస్ దేశంలోకి వచ్చేసింది. దేశంలో తొలిసారి గుజరాత్‌లో మూడు జికా పాజిటివ్ వైరస్ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో జికా వైరస్ ఛాయలు కనిపించాయి. దీంతో ఏపీ అలెర్టయ్యింది. బ్రెజిల్‌లో రెండువేల మందిని జికా వైరస్ పొట్టనబెట్టుకుంది. 
 
జికా వైరస్‌కు కారణం దోమలు. ఈ నేపథ్యంలో జికా సహా ఎన్నో వ్యాధులను వ్యాపింపజేస్తున్న దోమల నివారించాలని ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ నడుం బిగించాయి. దోమల ద్వారా వచ్చే రోగాల నుంచి ప్రజలను రక్షించే దిశగా.. సరికొత్త హైటెక్ టూల్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి
 
వీటికి కాలిఫోర్నియా లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు కూడా జత కలిశాయి. జికా వైరస్ కలిగున్న దోమల కోసం టెక్సాస్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని మైక్రోసాఫ్ట్ ఎంచుకుని, అక్కడి నుంచి దోమలను సేకరిస్తోంది. ఇక దోమలు సంతానోత్పత్తిని తగ్గించే దిశగా, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు అనుబంధం లైఫ్ సైనెన్సెస్ విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. 
 
దోమల ద్వారా రోగ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రారంభమైన ఈ ప్రయత్నాలు విజయవంతం అయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చునని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎటోమాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆనంద శంకర్ రే అభిప్రాయపడ్డారు. యూఎస్‌కు జికా వైరస్ ప్రయాణికుల ద్వారానే వచ్చిందని ఆయన గుర్తుచేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా ...

news

డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ ...

news

రోజా పెద్ద తాగుబోతు.. పీకే ఏం పీకుతాడో చూడాలి... ఎవరు?

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార, ...

news

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్

అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక ...

Widgets Magazine