శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (15:44 IST)

విశ్వసుందరిగా సౌతాఫ్రికన్ గర్ల్ - టాప్-20లో కూడా లేని భారత బ్యూటీ

విశ్వసుందరిగా సౌతాఫ్రికన్ బ్యూటీ ఎంపికయ్యారు. ఆమె పేరు జోజిబిని టుంజీ. ఈమెకు ఈ యేడాది ప్రపంచ సుందరి కిరీటం దక్కింది. స్విమ్ సూట్, ఈవెనింగ్ గౌన్ రౌండ్లలో ఆకట్టుకున్న ఈ నల్లకలువ ఆఖరులో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెప్పి విశ్వ విజేతగా నిలిచింది. ఈ పోటీలు ఆదివారం రాత్రి జరిగాయి. 
 
మిమ్మల్మే విజేతగా ఎందుకు ఎన్నుకోవాలని అని ప్రశ్నించగా.... తనలాంటి శరీర ఛాయ కలిగిన స్త్రీలను అందాలభామలుగా పరిగణించని లోకంలో ఎదిగానని, ఈరోజుతో ఆ భావనకు ముగింపు పలకాలని భావిస్తున్నానని ఆత్మవిశ్వాసంతో ఆమె పలికిన మాటలు న్యాయనిర్ణేతలను మెప్పించాయి. దీంతో ఆమెను విశ్వ విజేతగా జడ్జీలు ప్రకటించారు. ఫలితంగా ఆమెకు 2018 మిస్ యూనివర్శ్‌గా నిలిచిన కర్టియోనా గ్రే కిరీటం బహుకరించింది. 
 
ఇకపోతే, ఈ పోటీల రన్నరప్‌గా మిస్ మెక్సికో సోఫియా ఆరగాన్, మిస్ ప్యూర్టోరికా మాడిసన్ ఆండర్సన్ నిలిచారు. కాగా, భారత్ నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా వర్తికా సింగ్ కనీసం టాప్-20లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. ఈ అందాల పోటీలు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించారు. 
 
కాగా, ఈ పోటీల్లో భారత తరపున వర్తిగా సింగ్ పాల్గొంది. ఆమె టాప్ 20లో కూడా చోటు దక్కించుకోలేక పోయింది. ఫలితంగా ఆమె ఈ పోటీల నుంచి ముందుగానే నిష్క్రమించింది.