1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (14:55 IST)

సార్క్: మోడీ-షరీఫ్ హాయ్.. బై.. పప్పు-రోటీ, చికెన్-మటన్!

సార్క్ సమావేశాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్టిపట్టనట్లు వ్యవహరించారు. హాయ్.. బై మాటలకే పరిమితమయ్యారు. భారత్-పాక్‌ల మధ్య సమస్యలున్నా వాటి పరిష్కారం కోసం ఇద్దరూ భేటీ కాలేదు.
 
మరోవైపు సార్క్ సమావేశాల్లో భాగంగా నేపాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ  సాదాసీదా భోజనంతో సరిపుచ్చుకున్నారు. ఖాట్మండూలోని హోటల్ క్రౌన్ ప్లాజాలో బస చేసిన మోడీ లంచ్‌లో జీరా రైస్, పప్పు, రోటీలను ఆహారంగా తీసుకున్నారు. 
 
ఆయన కోసం తక్కువ నూనె వేసి ఆహార పదార్థాలను తయారు చేసినట్టు హోటల్ వర్గాలు తెలిపాయి. రాత్రి డిన్నర్‌లోనూ ఆయన మితాహారమే స్వీకరించారట. అల్పాహార సమయంలో ఊతప్పం, ఇడ్లీలను చెఫ్‌లు తయారుచేసి అందించారు. 
 
అయితే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో భారీ మెనూను ఏర్పాటు చేశామని హోటల్ తెలిపింది.