సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:20 IST)

96 ఏళ్లనాటి స్కాచ్ విస్కీ.. 60 ఏళ్ల పాటు పీపాలలో మగ్గించి..

Whisky
Whisky
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన "స్కాచ్ విస్కీ"ని వేలం వేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ "సోథెబి" సంస్థ సిద్ధమైంది. స్కాచ్ విస్కీని లండన్‌లోని నవంబర్ 18 (2023)న వేలానికి సిద్ధం చేసింది. వేలంలో దీని ధర 1.2 మిలియన్ పౌండ్లు (1.4 డాలర్లు) అంటే భారతీయ కరెన్సీలో రూ.11కోట్లు పైనే పలుకుతుందని అంచనా వేస్తోంది సంస్థ. 
 
ఈ స్కాచ్ విస్కీ 96 ఏళ్లనాటిది. సింగిల్ మల్ట్ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ ఇది. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు నవంబర్ 1 నుంచే ముందస్తు బిడ్డింగ్ వేసుకోవచ్చు అని ప్రకటించారు. 
 
కాగా.. 2019లోనూ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ బాటిల్ ఒక దాన్ని వేలం వేయగా.. ఆనాడు 1.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) పలికింది. 
 
తాజాగా వేలానికి సిద్ధమవుతున్న ఈ స్కాచ్ విస్కీ 60 ఏళ్ల పాటు పీపాలలో మగ్గించి, 1986లో మెకాల్లన్ 1926 విస్కీని 40 బాటిళ్లు తయారు చేశారు.