Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జార్జిబుష్ అసభ్యంగా ప్రవర్తించారు...

శుక్రవారం, 17 నవంబరు 2017 (11:23 IST)

Widgets Magazine
george-h-w-bush

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈవిధంగా ప్రముఖుల చేతిలో వేధింపులకు గురైన మహిళలు మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. తాజాగా, అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్‌ డ‌బ్ల్యూ బుష్ సీనియ‌ర్ త‌న‌ను అస‌భ్యంగా ముట్టుకున్నాడంటూ మిచిగాన్‌కి చెందిన 55 ఏళ్ల మ‌హిళ ఆరోపణలు చేసింది. 
 
బుష్ రెండో సారి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా డియ‌ర్‌బోన్‌లో ఉన్న‌పుడు త‌న‌తో అధ్య‌క్షుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆ మహిళ తెలిపింది. కానీ మీడియా సమావేశంలో ఫోటో దిగుతుండగా అలా జరిగివుంటుందని తాను అనుకున్నానని కానీ.. బుష్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. 
 
ఇటీవ‌ల 2003 నుంచి 2016 మ‌ధ్య‌కాలంలో త‌మ‌ను లైంగికంగా బుష్ వేధించాడంటూ బ‌య‌టికి చెప్ప‌డంతో త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి పున‌రాలోచ‌న చేసిన‌పుడు బుష్ కావాల‌నే చేసిన‌ట్లు అర్థ‌మైంద‌ని తెలిపింది. తనతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌పుడు ఆయ‌న మ‌ధ్య‌వ‌య‌స్కుడేనని ఆ మ‌హిళ చెప్పింది. ఈ ఆరోప‌ణ‌లు బుష్ ప్ర‌తినిధి జిమ్ మెక్‌గ్రా కొట్టిపారేశారు. దీనికి ముందు వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు బుష్ త‌ర‌ఫున‌ జిమ్ మెక్‌గ్రా క్ష‌మాప‌ణ‌లు కోరిన సంగ‌తి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ చేసిన పనికే.. ఐటీ రైడ్లు.. పెరోల్‌లో బయటికి వచ్చి?

అక్రమాస్తుల కేసులో చిప్పకూడు తింటున్న చిన్నమ్మ శశికళ ఈమధ్య భర్తకు బాగోలేదని పెరోల్‌పై ...

news

బిర్యానీ వండటం చేతకాదని.. భార్యను పుట్టింటికి పంపించాడు

బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. ...

news

వాణి విశ్వనాథ్ నాకు పోటీనా? నాకు హోం మంత్రి పదవి ఇస్తే చేస్తా: రోజా

సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ తనకు పోటీనా.. తాను అలా అనుకోవట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

news

People for sale: మనుషులను అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు...

ప్రపంచం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామంటూ వేదికలపై గొప్పగా చెప్పుకుంటుంటాం. అయినా ఇంకా ...

Widgets Magazine