గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (06:40 IST)

మొండికేసిన భారత్‌ను చర్చల బల్లవద్దకు తీసుకొచ్చాం: బీరాలు పోయిన ముషారఫ్

కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు. కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్

కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు.  కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్ తొలిసారిగా బయటపెట్టారు. 
 
ఇస్లామాబాద్‌ కశ్మీర్‌లోని ‘స్వాతంత్య్ర సమరయోధుల’(కశ్మీర్‌ వేర్పాటువాదులు)కు తమ ప్రభుత్వం మద్దతుగా నిలబడిందనీ, వారికి అవసరమైన సహాయం చేసిందని పాకిస్తాన్  మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ సోమవారం చెప్పారు.
 
కేవలం వారితోనే పని అవ్వదనీ, కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై భారత్‌తో చర్చలకు రాజకీయ విధానం అవసరమని అనంతరం  గుర్తించినట్లు తెలిపారు. భారత్‌ చర్చించడానికి కూడా ఇష్టపడని విషయాలపై రాజీ కుదుర్చుకునేందుకు తాము భారత్‌ను చర్చల వరకు తీసుకొచ్చామని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముషార్రఫ్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. ముషారఫ్ స్వయంగా భారత్‌తో చర్చలకోసం వాజ్‌పేయి హయాంలో ఆగ్రాకు వచ్చిన విషయం తెలిసిందే.