బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (14:03 IST)

లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలను సంద‌ర్శించిన ఎమ్మెల్యే వ‌సంత‌

మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలను కళాశాల వ్వవస్దాపక అధ్యక్షుడు, యన్ఆర్ఐ లక్కిరెడ్డి హనిమిరెడ్డితో కలసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు సంద‌ర్శించారు. ఈ సందర్బంగా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ తరగతులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, ఉన్నత విద్య అభ్యసిస్తున్నవిద్యార్థులు, ఈ దశలో తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తుకు పునాదులని తెలిపారు.

 
 
ఒక్కో మెట్టు పైకి ఎక్కి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ ప్రాంత ప్రజలకు దార్శనికులు, విద్యా దాతలు, లక్కీరెడ్డి బాలిరెడ్డి ఇటీవ‌ల విదేశాల్లో మృతి చెందిన విష‌య‌మై ఎమ్మెల్యే త‌న సంతాపాన్ని తెలిపారు. బాలిరెడ్డి సోదరుడు హనిమిరెడ్డి, ఆయ‌న కుటుంబ సభ్యులు విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కొనియాడారు. లక్కీరెడ్డి హనిమిరెడ్డి డీగ్రి కళశాలను  రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కళశాలగా తీర్చిదిద్దిన హనిమిరెడ్డిని,   వారు పేద విద్యార్థుల కోసం చేస్తున్న విద్యా దాన గుణాన్ని మెచ్చుకున్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు,  అధ్యాపకులు పాల్గొన్నారు.