మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

జస్ట్ మిస్ : ఎంత అదృష్టవంతుడో... ఈ వీడియో చూడండి..

కొన్ని ప్రమాదాలు లిప్తపాటులో జరిగిపోతుంటాయి. అదేనండి.. జస్ట్ మిస్ కావడం. సరిగ్గా అలాంటి ప్రమాదమే ఒకటి చైనాలో జరిగింది. చైనా జుజాయ్ ప్రావిన్స్‌లో రోడ్డు పనులు జరుగుతున్నాయి.

కొన్ని ప్రమాదాలు లిప్తపాటులో జరిగిపోతుంటాయి. అదేనండి.. జస్ట్ మిస్ కావడం. సరిగ్గా అలాంటి ప్రమాదమే ఒకటి చైనాలో జరిగింది. చైనా జుజాయ్ ప్రావిన్స్‌లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ లైన్‌లో వెళ్లే కార్లు అన్నీ కూడా స్లోగా వెళుతున్నాయి. అలా వెళుతున్న ఓ కారుపై ఉన్నట్టుండి భారీ క్రేన్ ఒకటి పడిపోయింది. సరిగ్గా కారు ఇంజిన్ భాగంలో పడింది. 
 
అంతేముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఇంత పెద్ద ప్రమాదంతో షాక్ అయిన మిగిలిన వారు.. కారులో ఉన్న వారు ఏమయ్యారో అని పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ కారు డ్రైవింగ్ సీట్లలోని వ్యక్తి కారు పైభాగంలోని రూఫ్ గ్లాస్ నుంచి బయటకు రావటం కనిపిస్తుంది. డ్రైవర్ కాలికి గాయం కావటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అంత పెద్ద క్రేన్ కారుపై పడిన తర్వాత అందులోని వ్యక్తి సేఫ్‌గా బయటకు రావటం నిజంగా అతని అదృష్టమని చెప్పాలి.