మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (22:52 IST)

నాసా అదుర్స్.. అరుణ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్ ఎగిరిందోచ్! (video)

Mars
నాసా అరుదైన రికార్డు సాధించింది. అరుణ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్‌ ఎగిరింది. భూమ్మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ చరిత్ర సృష్టించింది. 
 
భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. నాసా తన మినీయేచర్ హెలికాఫ్టర్ ఇన్‌జెన్యూటీని అరుణ గ్రహంపై విజయవంతంగా నడిపింది. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీ ఎగిరినట్లు నాసా వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు ప్రయాణించి.. అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండైంది.
 
హెలికాప్టర్‌ ఎగురవేయడానికి మార్స్‌పై అంతగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఈ మిషన్‌పై మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రోజున హెలికాప్టర్‌ ఇన్‌జెన్యూటీని తొలిసారిగా టెస్ట్‌ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేశామని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. 
Wright Brothers
 
అందుకు సంబంధించిన వీడియోను నాసా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. నాసా ఈ పరీక్షను ‘రైట్‌ బ్రదర్స్‌ సోదరుల మూమెంట్‌’ గా అభివర్ణించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి.