శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:37 IST)

చైనాకు అభినందనలు తెలిపిన కిమ్... కూరగాయల కొరతను?

అమెరికా విమర్శలు కురిపించినప్పటికీ.. వింటర్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు చైనాకు అభినందనలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తెలిపారు. 
 
అమెరికా, దాని మిత్ర దేశాల నుండి బెదిరింపులు, శత్రు విధానాలను అణచివేసేందుకు చైనాతో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి సందేశాన్ని పంపినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సాగు బాటపట్టారు. దేశ ప్రజ ఆహార ప్రమాణాలను పెంచే దిశగా కూరగాయల కొరతను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. 
 
దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు.