1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2016 (17:04 IST)

అణు దాడి చేస్తారా? బుద్ధి ఉందా? పాకిస్థాన్‌కి చీవాట్లు పెట్టిన అమెరికా, రష్యా

ఢిల్లీ: భారత్ పైన అణు దాడి చేస్తామని కవ్వింపు ధోరణితో మాట్లాడుతున్నపాకిస్థాన్ దేశానికి అమెరికా, రష్యాలు తీవ్రంగా చీవాట్లు పెట్టాయి. పిచ్చిపిచ్చి ప్రకటనలు ఇస్తే, అత్యుత్సాహంతో ముంద‌డుగు వేస్తే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాకిస్తాన్ దేశానికి హ

ఢిల్లీ: భారత్ పైన అణు దాడి చేస్తామని కవ్వింపు ధోరణితో మాట్లాడుతున్నపాకిస్థాన్ దేశానికి అమెరికా, రష్యాలు తీవ్రంగా చీవాట్లు పెట్టాయి. పిచ్చిపిచ్చి ప్రకటనలు ఇస్తే, అత్యుత్సాహంతో ముంద‌డుగు వేస్తే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాకిస్తాన్ దేశానికి హెచ్చరిక జారీ చేశాయి. మ‌రోప‌క్క పాక్ కాల్పుల ఒప్పందాన్ని పక్కన పెట్టి గత రెండు రోజుల్లో 6 సార్లు భారత్ పైన అక్రమంగా కాల్పులకి తెగబడింది.
 
తాజాగా ఆక్నూర్ సెక్టారులో కాల్పులకు తెగబడగా భారత దళాలు వాటిని తిప్పికొట్టాయి. ప్ర‌పంచ తీవ్రవాద గ్రూపులకు కేంద్రంగా ఉన్నపాకిస్థాన్ తన దేశ అభివృద్ధిపై మాత్రం దృష్టి పెట్టకుండా ఇతర దేశాలలో కల్లోలం సృష్టించడం తన లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని భార‌త్ ఆరోపిస్తోంది. 
 
ఈ కారణంగానే ఉగ్ర మూకలతో బాధపడే అగ్ర దేశాలు పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక భారత్ పొరుగు దేశం డ్రాగన్‌ మాత్రం వేదాలు వల్లిస్తూ, పాక్ కొమ్ము కాస్తూ, భారత్ పైకి యుద్ధానికి రెచ్చగొడుతున్నదని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. తద్వారా ప్రపంచంలో కల్లోలం సృష్టించాలని డ్రాగన్ దేశాల దుష్ట ఆలోచన అని పేర్కొంటున్నారు.