Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒబామా నోరు విప్పారు.. ట్రంప్ నిర్ణయం కోపం తెప్పించింది.. వివక్ష వద్దు..

మంగళవారం, 31 జనవరి 2017 (15:58 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు విప్పారు. శరణార్థుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు కొందరు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఈ నిరసనలకు ఒబామా మద్దతు ప్రకటించారు. మతం, విశ్వాసాల ఆధారంగా వ్యక్తులను వివక్షకు గురిచేయడాన్ని ఎంత మాత్రం ఏకీభవించనని ఒబామా స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనకు కోపం తెప్పించిందని చెప్పారు.
 
వైట్‌హౌస్‌ను వీడిన పదిరోజుల తర్వాత ఒబామా ట్రంప్‌కు వ్యతిరేకంగా నోరు విప్పారు. ముస్లింలపై నిషేధం విషయంలో తాను కూడా ఒబామా విధానాలనే అనుసరిస్తున్నా అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఒబామా కార్యాలయం ప్రకటన చేసింది. ట్రంప్‌ జారీచేసిన ట్రావెల్‌ నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ఒబామా మద్దతు పలికారు. 
 
దేశవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న ఉద్యమంతో ఒబామా కదిలిపోయారని ప్రకటన ద్వారా తెలిపారు. ఒకచోట గుమికూడి.. ఎన్నికైన నేతలకు తమ గళం వినిపించేందుకు పౌరులు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నారని.. అమెరికా విలువలు ప్రమాదంలో పడినప్పుడు పౌరుల కర్తవ్యం ఇదని పేర్కొన్నారు. 
 
కాగా.. సిరియా, ఇరాక్‌ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఆదేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ఈ అంశంపై ఆయన స్పందించారు. మతం, విశ్వాసం ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని సైద్ధాంతికంగా ఒబామా ఏకీభవించడం లేదని, ఆయన విదేశాంగ విధాన నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని చాటుతాయని ఒబామా కార్యాలయం వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతిలో పోలీసులే కబ్జాదారులు - రెండు కోట్ల స్థలం హాంఫట్...

కాపలా ఉండాల్సిన పోలీసులే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వ ఆస్తులకు ...

news

ఎమ్మెల్యే బాలయ్య ఇలాకాలో పీఏ రాజ్యం... నేతల రహస్య భేటీ... హిందూపూర్‌లో కలకలం

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం హిందూపూర్. ఇక్కడ ఆయన ...

news

ట్రంప్ ఆదేశాలను అమలు చేయనంటే చేయను.. అటార్నీ జ‌న‌ర‌ల్ స‌ల్లీ యేట్స్‌ పై వేటు

ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ఇమ్మిగ్రేషన్ ఆదేశాలపై ...

news

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు ...

Widgets Magazine