శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:25 IST)

భర్త మరణంతో లోకం చీకటైపోయింది.. కుప్పకూలిపోయా.. తండ్రికి కారు కొనిచ్చారు: సునయన

ఫిబ్రవరి 22 ఉదయం ఆఫీసుకు వెళ్తూ.. తన భర్త తనకు బై చెప్పాడని.. ఆయనను ప్రాణాలతో చూడ్డం అదే చివరి సారి అని కన్సస్ కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ సతీమణి సునయన తెలిపారు. భర్త మరణంతో తన లోకం ఒక్కసారిగా చీ

ఫిబ్రవరి 22 ఉదయం ఆఫీసుకు వెళ్తూ.. తన భర్త తనకు బై చెప్పాడని.. ఆయనను ప్రాణాలతో చూడ్డం అదే చివరి సారి అని కన్సస్ కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ సతీమణి సునయన తెలిపారు. భర్త మరణంతో తన లోకం ఒక్కసారిగా చీకటైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయేందుకు రెండు రోజుల ముందు రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వచ్చాడని.. వర్క్ ఇంటికి తెచ్చుకోమన్నానని.. అందుకు అతను ఓకే చెప్పాడని సునయన తెలిపారు. 
 
చనిపోయే రోజు రాత్రి 7గంటలకల్లా ఇంట్లో ఉంటానని చెప్పాడని, 8 గంటలైనా రాకపోవడంతో తాను ఆందోళన చెందానని సునయన చెప్పుకొచ్చారు. కాల్పుల ఘటనపై అలోక్ భార్యకు ఇతర స్నేహితులకు కూడా ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తాను భోజనం చేస్తూ అలవాటుగా ఫేస్‌బుక్‌ చూస్తున్నానని, అందులో ఓ వీడియో చూసి పరుగులు తీశానని.. ఇంతలో ఇద్దరు పోలీసులు ఇంటికొచ్చి అసలు విషయం చెప్పారు. 
 
ఆ విషయం తెలిసి కుప్పకూలిపోయానని సునయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన భర్త శ్రీనివాస్‌ ఇటీవలే తన తండ్రికి ఒక కారు కొనిచ్చారని, కొడుకు ఇచ్చిన ఆ బహుమతి చూసి తన మామ ఆనందించారని సునయన చెప్పారు. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఎంతగానో భయపడ్డానని.. భయంతో సరిగా నిద్ర కూడా పోయేదాన్ని కానని వెల్లడించారు.