శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (09:11 IST)

102 యేళ్ళ బామ్మ సాహసం... 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్

నిజానికి నేలపై చిన్నపాటి సాహసం చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి. చిన్నపాటి సాహసాలు చేసేందుకు సైతం యువత వెనుకంజ వేస్తుంటారు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన 104 యేళ్ళ బామ్మకు మాత్రం గుండె ధైర్యం ఎక్కువ. అందుకే 14 వేల అడుగుల ఎత్తు నుంచి ఆమె స్కైడైవింగ్ చేసి రికార్డు సృష్టించింది. ఆమె పేరు ఒషియా. ఈమె చేసిన స్కైడైవింగ్ ఇపుడు గిన్నిస్ రికార్డు పుటలెక్కింది.
 
మోటార్ న్యూరాన్ జబ్బుతో బాధపడుతున్న వారికి విరాళాలు సేకరించేందుకే ఈ బామ్మ సాహసాలు చేస్తోంది. మూడోసారి స్కైడైవింగ్ చేసింది. పదేళ్ల కిందట ఒషియా కూతురు మోటార్ న్యూరాన్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. తన కూతురిలా ఎవరూ చనిపోకూడదని, ఆ వ్యాధితో బాధపడుతున్న మరెవరూ మృత్యువాతపడకూడదని భావించింది. స్కైడైవింగ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులను న్యూరాన్ జబ్చుతో బాధపడుతున్న వారికి ఇవ్వాలనుకుంది. 
 
ఇందుకోసం ఓ ప్రొఫెనల్ స్కైడైవర్ సహాయంతో 14 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. గంటకు 220 కిమీ వేగంతో కిందికి వస్తున్నా.. ఆమె ఏమాత్రం ఆందోళన చెందకుండా హ్యాపీగా నవ్వుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బామ్మ ఈ వయస్సులో చేసిన సహసం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలోనూ ఈ బామ్మ రెండుసార్లు స్కైడైవింగ్ సాహసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోనూ మీరూ చూడండి.