గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (13:02 IST)

కెన్యా అసెంబ్లీలో కంపు.. సభకు బ్రేక్.. ఎయిర్ ఫ్రెష్‌నర్స్ తెమ్మని..?

కెన్యా అసెంబ్లీ కంపు కొట్టడంతో తాత్కాలికంగా సభకు బ్రేక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కెన్యా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.


సరిగ్గా ఆ సమయంలో ఎవరో గానీ గ్యాస్ వదిలారు. అది అలా అలా చుట్టుపక్కల అంతా వ్యాపించింది. ఆ కంపు భరించలేక సభ్యులందరూ ముక్కు మూసేసుకున్నారు. కంపు భరించలేకపోతున్నామని పరుగులు పెట్టారు. 
 
అధ్యక్షా తమలో ఒకరు ఈ గాలిని కాలుష్యం చేశారు. అదెవరో తనకు తెలుసునని జూలియస్ గయా అనే ఎమ్మెల్యే విషయాన్ని స్పీకర్‌కి తెలిపారు. ఈ ఆరోపణను మరో సభ్యుడు ఖండించారు. విషయం అర్థం చేసుకున్న స్పీకర్ ఎడ్విన్ కకాచ్.. అందరిని బయటికి వెళ్లమన్నారు. 
 
అప్పుడే గాలి క్లీన్ అవుతుందన్నారు. అంతేగాకుండా సభకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు వెంటనే వెళ్లి ఎయిర్ ఫ్రెష్‌నర్స్ తీసుకురండని అసెంబ్లీ తీసుకురండంటూ ఆదేశించారు.