1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (08:59 IST)

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ay12 virus
గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతుంది. ముఖ్యంగా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 26 వేల కోవిడ్ కేసులు నమోదు కావడం సింగపూర్ పాలకులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్‌ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
అలాగే, ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకోవాలని సూచించారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని సింగపూర్ వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల దేశ ప్రజలతో పాటు వైద్యాధికారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యం మంత్రి కుంగ్ కోరారు. కాగా, గత ఏప్రిల్ నెల చివరి వారంలో సింగపూర్ దేశ వ్యాప్తంగా ఏకంగా 13,700 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.