శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (10:23 IST)

సౌత్ సూడాన్‌లో రోడ్డు ప్రమాదం : 56 మంది దుర్మరణం!

దక్షిణ సూడాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టిన ప్రమాదంలో 56 మంది దుర్మరణం పాలయ్యారు. దక్షిణ సూడాన్ ప్రధాన రహదారిపై ఈ ఘోరం చోటు చేసుకుంది. అయితే, మినీ బస్సులో సామర్థ్యానికి మంచి ప్రయాణికులు ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు చెపుతున్నారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని... ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను ఇప్పటికే పోస్ట్మార్టం నిమిత్తం అస్పత్రికి తరలించామని తెలిపారు. దక్షిణ సూడాన్ నుంచి పొరుగు దేశాలకు కలిపే జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడుతుంది. ఈ కారణంగా ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.