రేష్మ.. అతడికి నాలుగో భార్య.. అయినా ఎందుకో కాల్చి చంపేశాడు..?

పాకిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో గాయకురాలు, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న రేష్మ భర్త చేతులారా దారుణంగా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె భర్తే తుపాకీతో ఆమెను కాల్చి చం

selvi| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (11:05 IST)
పాకిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో గాయకురాలు, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న భర్త చేతులారా దారుణంగా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె భర్తే తుపాకీతో ఆమెను కాల్చి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌లో ఫేమస్ అయిన ''జోబల్ గోలునా'' డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.
 
వివరాల్లోకి వెళితే.. నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఆమె భర్తేనని తెలుస్తోంది. నిందితుడికి రేష్మ నాలుగో భార్య. 
 
ఇక పోలీసులు రేష్మ భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, ఈ సంవత్సరంలో పాకిస్థాన్‌లో మహిళా కళాకారులను దారుణంగా హత్యకు గురైన ఘటనల్లో ఐది 15వ ఘటన కావడం గమనార్హం.దీనిపై మరింత చదవండి :