శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (08:49 IST)

కాశ్మీర్ ద్వైపాక్షిక అంశం.. మధ్యలో మీరెందుకు వేలుపెట్టడం.. ఐరాసలో చైనాకు షాక్

కాశ్మీర్ అంశంలో వేలు పెట్టేందుకు ప్రయత్నించిన చైనాకు ఐక్యరాజ్య సమితిలో గట్టి షాక్ కొట్టింది. కాశ్మీర్ అంశం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని, ఆ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారమవుతుందని నాలుగు అగ్రదేశాలు చైనాకు తేల్చి చెప్పాయి. దీంతో చైనా కిమ్మనకుండా ఉండిపోయింది. 
 
ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. తనకు మిత్రదేశంగా ఉన్న పాకిస్థాన్‌ను మరింతగా దగ్గరకు చేర్చుకునేందుకు వీలుగా ఐరాసలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు చైనా మరోమారు గట్టిగానే ప్రయత్నం చేసింది. 
 
ఒక ఆఫ్రికా దేశానికి చెందిన అంశంపై చర్చించేందుకు బుధవారం ఐరాస భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. ఇందులో చర్చించాల్సిన రహస్య ఇతర అంశాల జాబితాలో కాశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని పాక్ మిత్రదేశం చైనా కోరింది. అయితే, దీనికి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర అగ్రదేశాలు సమ్మతించలేదు. అది భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని భద్రతా మండలి తేల్చి చెప్పడంతో చైనాకు భంగపాటు తప్పలేదు.
 
దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందిస్తూ, కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేస్తామని ప్రయత్నించిన పాక్ ప్రయత్నాలు విఫలమ్యాయి. కుట్రలను పక్కనపెట్టి ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పాక్ చేస్తున్నవి నిరాధార ఆరోపణలని మరోమారు తేలిపోయిందన్నారు.