శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (16:44 IST)

పాకిస్థాన్ సైన్యం నీచబుద్ధి.. కరోనా వ్యాధిగ్రస్థులను పీఓకేలోకి..?

పాకిస్థాన్ సైన్యం దురాగతం వెలుగులోకి వచ్చింది. ఆ దేశ సైన్యం ఎంత నీచంగా ఆలోచిస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచమంతా కోవిడ్-19 వైరస్‌తో అల్లాడుతున్న సమయంలో, ఆ వైరస్ పాజిటివ్ రోగులను పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు (పీఓకే) లోకి, గిల్గిట్ బాల్టిస్థాన్‌లోకి తరలిస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 
 
అయినా పాక్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇదిలావుండగా, పంజాబ్ ప్రావిన్స్‌తో పోల్చుకుంటే, పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లకు పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రాధాన్యం లేదు. అందువల్ల పాకిస్థాన్ ఆర్మీ ఈ ప్రాంతాల ప్రజల నిరసనను పట్టించుకోవడం లేదు. ఇంకా ఈ రెండు ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులోకి లేకపోవడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
పాకిస్థాన్ సైనిక స్థావరాలు, సైనిక కుటుంబాల నివాస ప్రాంతాలు ఉన్నచోట, వాటికి సమీపంలో కోవిడ్-19 పాజిటివ్ రోగులు ఉండటానికి వీల్లేదని సైనిక ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకే పంజాబ్ ప్రావిన్స్‌లోని కోవిడ్-19 పాజిటివ్ రోగులను బలవంతంగా తరలిస్తున్నట్లు సమాచారం. 
 
పెద్ద సంఖ్యలో ఈ వ్యాధిగ్రస్థులను తాళాలు వేసిన వాహనాల్లో పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లలోని మీర్‌పూర్, ముజఫరాబాద్, తదితర నగరాలకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పాకిస్థాన్ సైన్యం కాశ్మీరీలకు మరోసారి ద్రోహం చేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.