శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మే 2020 (19:22 IST)

పాకిస్తాన్‌లో కరోనా.. 24 గంటల్లో 38 మంది మృతి

పాకిస్తాన్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 నాలుగు గంటల్లో 1523 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో పాక్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 వేలు దాటిపోయింది. గత 24 గంటల్లో మరో 38 మంది కరోనాకు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 564కు చేరింది.
 
ఇలా కరోనా కలకలం ఓవైపు.. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక మరోవైపు.. ఇమ్రాన్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. అయితే ఆర్థిక స్థితి కుప్పకూలకుండా చూడాలని విశ్వప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్.. కరోనాను కూడా లేక్కచేయకుండా ఆంక్షలు ఎత్తివేసేందుకు యోచిస్తున్నారు.