శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (10:45 IST)

రెండున్నరేళ్ళలో 465 మందిని చంపేసిన పాకిస్థాన్ సర్కారు

గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా వివిధ నేరాల్లో ఉరిశిక్ష పడిన ఖైదీలే. నిజానికి పాకిస్థాన్‌లో ఉరిశిక్షలపై నిషేధం ఉండేది. ఈ నిషేధాన్ని పాకిస్థాన్ ప్ర

గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా వివిధ నేరాల్లో ఉరిశిక్ష పడిన ఖైదీలే. నిజానికి పాకిస్థాన్‌లో ఉరిశిక్షలపై నిషేధం ఉండేది. ఈ నిషేధాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం గత 2014లో ఎత్తివేసింది. ఆ తర్వాతే అంటే రెండున్నరేండ్లలో 465 మంది ఖైదీలను ఉరితీసింది. 
 
అంతర్జాతీయంగా ఉరిశిక్షలను అత్యధిక సంఖ్యలో అమలుచేస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్ తొలి నాలుగు స్థానాల్లో ఉండగా, పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఉగ్రవాదం, నేరాల తగ్గింపునకు ఉరిశిక్షలను అమలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించడానికి కూడా ఉరిశిక్షలను అమలుచేస్తున్నారని జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్థాన్ (జేపీపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ బెలాల్ తెలిపారు.