గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:27 IST)

బాబ్బాబు.. మీతో చర్చలు జరుపుతాం : భారత్‌తో కాళ్ళబేరానికి పాకిస్థాన్

పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అన్ని సమస్యలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ మీడియా ద్వారా ప్రకటించారు. దీనికంతటికీ కారణం.. అంతర్జాతీయంగా పాకిస్థాన్ కావడమే. భారత్ దౌత్యనీతితో పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాని చేస్తోంది. చివరకు తమకు అండగా నిలబడుతుందని నమ్మిన చైనా కూడా చివరకు పాకిస్థాన్‌కు హ్యాండిచ్చింది. దీంతో పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చి చర్చల ప్రతిపాదనను తెలపైకి తెచ్చింది. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీవోకేలోని జైష్ ఉగ్రతండాలపై వైమానిక దళంతో మెరుపుదాడులు చేయించింది. దీంతో పాకిస్థాన్ రెచ్చిపోయి భారత్‌పై దాడికి యత్నించింది. ఈ దాడులను భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
అదేసమయంలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్‌పై తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌‌లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మద్ ఖురేషి ప్రకటించారు.