Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎర్రకోట భారత్‌ది కాదు.. పాకిస్థాన్‌ది : చైనా చాయాచిత్రాల పదర్శనలో అపశృతి

గురువారం, 15 జూన్ 2017 (13:18 IST)

Widgets Magazine
redfort

చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది పాకిస్థాన‌కు చెందినది పేర్కొంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాల ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఆ దేశానికి చెందిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమానికి భారత ప్రతినిధి విజయ్ గోఖలే, పాక్ ప్రతినిధి మసూద్ ఖలీద్‌లు హాజరయ్యారు. ఇందులో ఓ ఛాయాచిత్రాన్ని లాహోర్‌లోని షాలిమార్ గార్డెన్స్‌గా నిర్వాహకులు పేర్కొన్నారు. దాన్ని చూసిన భారత్, పాక్ ప్రతినిధులు, రాయబారులు అవాక్కయ్యారు. ఆ ఛాయాచిత్రం ఏమిటంటే... ఢిల్లీలోని మన ఎర్రకోట. ఎర్రకోటపై మన మువ్వన్నెల జెండా కూడా ఎగురుతుండటం గమనార్హం.
 
దీంతో, వెంటనే ఈ విషయాన్ని నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లాకగనీ, వారు నిద్రమేల్కోలేదు. ఆ తర్వాత ప్రదర్శన నిర్వాహకులపై వారు మండిపడ్డారు. ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తున్నప్పుడు, ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో, జరిగిన తప్పుకు నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pakistan China Lahore Red Fort Sco Event

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నడ నటికి చుక్కలు చూపించిన టెక్కీ.. స్నేహం-ప్రేమ- సహజీవనం.. చివరికి పెద్దలు వద్దన్నారని?

కన్నడ నటికి ఓ టెక్కీ ముఖం చాటేశాడు. కన్నడనటితో స్నేహం చేసి.. ఆమెను ప్రేమించి.. ఆపై ...

news

పళణిస్వామి ఎప్పుడైనా పదవీగండం తప్పదా? ఆగస్టు తర్వాత అవిశ్వాస పరీక్ష!

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి పదవీగండం దగ్గరలోనే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ ...

news

పశువధ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేకు నిరాకరణ

పశువుల రవాణా, వధపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ...

news

బాహుబలి ఎఫెక్ట్.. రానా వాహనం స్ఫూర్తితో ''దుర్గ్‌ రోడ్ క్లీనర్''

బాహుబలి సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు ...

Widgets Magazine