శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (09:08 IST)

భారత్‌లో ఎక్కడెక్కడ దాడులు చేద్దాం : ఆర్మీ చీఫ్ - నవాజ్ షరీఫ్‌ల కీలక భేటీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులపై చేయాడాన్ని దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత సైన్యం చేసిన దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇవ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులపై చేయాడాన్ని దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత సైన్యం చేసిన దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇవ్వాలని పాకిస్థాన్ గట్టిగా భావిస్తోంది. ఇందుకోసం ఆర్మీ చీఫ్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. ఈ మేరకు పాక్‌ సైనికాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ‘ద న్యూస్‌’, రాయిటర్స్‌ కథనాలను ప్రచురించాయి. 
 
ఈ పత్రికల కథనాల మేరకు... భారత చర్యకు తక్షణం ప్రతిచర్యకు దిగాలని, భారత్‌లో ఎంపికచేసిన లక్ష్యాలపై దాడులు నిర్వహించడం ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని పాక్‌ భావిస్తోంది. భారత్‌లో ఏయే ప్రాంతాల్లో దాడులు చేయాలన్నది కూడా ఇప్పటికే పాక్‌ సైన్యం నిర్ణయించిందట. 
 
ముఖ్యంగా.. 'భారత్‌కు ధీగా జవాబిచ్చేందుకు ఆ దేశంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడులు చేస్తాం. ఈమేరకు మా బలగాలను సన్నద్ధం చేశాం' అని పాక్‌ సైనిక ఉన్నతాధికారి వెల్లడించారు. బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులను భారత ప్రోత్సహిస్తోందని, దీనికీ తగిన సమాధానం చెబుతామని ఆ అధికారి వ్యాఖ్యానించారు.