Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మగవారితో వ్యభిచారం.. పాకిస్థాన్ యువకుడి నిర్వాకం.. ఎక్కడ?

సోమవారం, 3 జులై 2017 (08:39 IST)

Widgets Magazine
homo sexual

సాధారణంగా వ్యభిచారవృత్తిలో అమ్మాయిలు నిమగ్నమవుతుంటారు. కానీ, ఇక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు వ్యభిచారాన్నే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తూ వచ్చాడు. చివరకు తన వద్దకు వచ్చిన ఇద్దరు విటులతో పాటు వారిద్దరితో వ్యభిచారం చేసిన నేరానికి పాక్ యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పాకిస్థాన్‌కు చెందిన 22 యేళ్ళ యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ కార్మికుల వసతి గృహాల్లో నివశిస్తూ వచ్చాడు. అయితే, ఈ గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు గమనించిన ఇతర కార్మికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొంతకాలంగా గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. 
 
కార్మికులు ఉండే ఓ ఇంటిలో పాక్ యువకుడు వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. రూ.350 (20 దినార్లు) తీసుకుని మగవారితో శృంగారంలో నిమగ్నమై ఉన్న సమయంలో పోలీసులు వెళ్లి ఆ యువకుడిని అరెస్టు చేశారు. అలాగే, అతడితో సెక్సులో పాల్గొన్న 26, 30 ఏళ్ల వయస్సున్న విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. 
 
విచారణ జరిపిన న్యాయస్థానం వ్యభిచారం చేస్తున్న యువకుడికి 6 నెలల జైలుశిక్ష విధించింది. మిగతా నిందితులిద్దరికీ చెరో రూ.3500 జరిమానా, 2 నెలల జైలుశిక్ష విధించింది. వీరికి శిక్షాకాలం పూర్తైన అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉపాధి కోసం వెళ్లారు.. ఐఎస్‌లో చేరారు.. ఆపై తిరిగిరాని లోకాలకు...

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల ...

news

అర్థరాత్రి జీఎస్టీ పన్ను వసూలు చేశాడు... తెల్లారేసరికి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు... ఎందుకని?

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ...

news

చనిపోయిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు.. శ్మశానికి తీసుకెళ్తుంటే కళ్లు తెరిచింది...

బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ...

news

అత్యాచార బాధితురాలిపై నాలుగోసారి యాసిడ్ దాడి...

తొమ్మిదేళ్ళ క్రితం అత్యాచారానికిగురై కుమిలిపోతున్న ఓ బాధితురాలిపై దుండగులు నాలుగో సారి ...

Widgets Magazine