శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:20 IST)

బలూచిస్థాన్‌లో రక్తపాతం... 100 మంది పాక్ సైనికుల హతం

పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రక్తపాతం పారించారు. తీవ్రవాదులు పెట్రేగిపోయారు. బలూచిస్థాన్‌లోని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాకిస్థాన్‌ సైనికులు మృత్యువాతపడ్డారు. 
 
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనా చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు తీవ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం గమనార్హం. ఈ దాడిలో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
అయితే, ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ మేరకు పాక్ హోం శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది. 
 
పాక్ హోం శాఖ అబద్ధాలు చెబుతుందని, ఈ దాడిలో వంద మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ ప్రాంతాన్ని వేరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది.