అన్నాచెల్లెళ్లకు పెళ్లి చేసిపెట్టారు.. అది నమ్మకమట.. ఎక్కడ?

marriage
Last Updated: బుధవారం, 9 జనవరి 2019 (11:49 IST)
అన్నాచెల్లెళ్ల బంధం.. ఆప్యాయతకు మారుపేరు. అలాంటి అన్నాచెల్లెళ్లకు అట్టహాసంగా పెళ్లి చేసిపెట్టారు తల్లిదండ్రులు. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒకే కాన్పులో అమ్మాయి, అబ్బాయి బుడితే వారు గత జన్మలో ప్రేమికులని విశ్వసిస్తారు. ఈ నమ్మకం ప్రకారం.. థాయ్‌లాండ్‌లో ఒకే కాన్పులో పుట్టిన అన్నాచెల్లెళ్లకు వివాహం చేసిపెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమర్నసన్ సుత్రోస్ మలిరాట్, పాచారాపర్న్ దంపతులకు 2012లో గిటార్, కివీలు జన్మించారు. ఒకే కాన్పులో మగ, ఆడపిల్లలు పుట్టడంతో అప్పుడే వారిద్దరికీ పెళ్లి చేసి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గిటార్, కివీలకు ఆరేళ్లు నిండగానే ఘనంగా వివాహం చేశారు. 
 
కివీని పెళ్లాడేందుకు గిటార్ 2 లక్షల భాట్‌ (రూ. 4.37 లక్షల కట్నం), రూ. 8 వేల విలువైన బంగారాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ వివాహం కేవలం నమ్మకానికి మాత్రమే. వీరిద్దరూ పెరుగుతూ అన్నాచెల్లెళ్లానే వుంటారు. యుక్తవయస్సు వచ్చాక ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్లి చేసుకుంటారు.దీనిపై మరింత చదవండి :