శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 9 జనవరి 2017 (13:48 IST)

ఆమ్ల వర్షం కాదు.. అది మలవర్షం

పైనుంచి ఏదయినా రాలి మన నెత్తినపడితే అవి వర్షపు చుక్కలు, వడగండ్లు కావచ్చు. లేదా పైనుంచి పిట్టలు రాల్చే పెంట అయినా కావచ్చు. కానీ మానవ మలం అమాంతగా మీరు వెళుతున్న కారు మీద పడిపోతే.. ఆ జోర్డాన్ మహిళకు సరిగ్గా అదే అనుభవం ఎదురైంది. అది విమానం నుంచి కిందపడిన

పైనుంచి ఏదయినా రాలి మన నెత్తినపడితే అవి వర్షపు చుక్కలు, వడగండ్లు కావచ్చు. లేదా పైనుంచి పిట్టలు రాల్చే పెంట అయినా కావచ్చు. కానీ మానవ మలం అమాంతగా మీరు వెళుతున్న కారు మీద పడిపోతే.. ఆ జోర్డాన్ మహిళకు సరిగ్గా అదే అనుభవం ఎదురైంది. అది విమానం నుంచి కిందపడిన మానవ వ్యర్థ పదార్థం అని తెలిసేసరికి గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న ఆమెకు తత్వం బోధపడినట్లయింది.
 
పశ్చిమ జోర్డాన్ లోని ఉటాకు చెందిన బెథానీ బౌకర్‌ తన పిల్లలను స్కూలు నుంచి తీసుకురావడానికి యథావిధిగా కారులో బయలుదేరింది. దారిలో ఉన్నట్లుండి కారుపై దుర్వాసనతో కూడిన పదార్థం చెల్లాచెదురుగా పడటం గ్రహించింది. ఏదన్నా పక్షి తన కారుపై పెంట వేసిందేమో అని ఆమె మొదట్లో భావించింది. కాని అది పక్షుల పెంట కాదని గుర్తించేందుకు ఆమెకు ఏమంత సమయం పట్టలేదు. అది ఖచ్చితంగా మానవ మలమేనని తెలుసుకునేసరికి ఇలా జరగటం ఇది తొలసారి కాదని ఆమెకు గ్రహింపుకొచ్చింది.
 
కొన్నేళ్ల క్రితం ఇలాగే తన కారుపై చాలాసార్లు ఇలాంటి పదార్థం పైనుంచి పడిన ఘటనలను ఆమె గుర్తు తెచ్చుకుంది. వాణిజ్య విమానం సమయం కాని సమయంలో తన టాయెలెట్ లలోని మానవ వ్యర్థ పదార్థాలను కిందికి విడుదల చేస్తున్నందువల్ల ఇలా జరుగుతుందని ఆమె గ్రహించింది. వెంటనే ఆమె జోర్డాన్ విమానయాన సంస్థకు ఆధారాలతో సహా చూపించేందుకు కారును వీడియో తీసింది. ఈ పెంట నుంచి బయటపడటమెలాగా అనేది తన సమస్య అని ఆమె చెప్పుకుంది.
 
ఇంతకూ విషయం ఏమిటంటే, విమానాశ్రయానికి సమీపంగా ఆమె నివాసం ఉంది. వాణిజ్య విమానాలు రాంగ్ టైమ్‌లో మానవ వ్యర్థాలను కిందికి వదిలేయడం ఈ మహిళకు పెను సమస్యగా మారింది. ప్రయాణీకులు విసర్జించిన వ్యర్థాన్ని విమానాశ్రయం వరకు తీసుకురాకుండా మధ్యలోనే పర్వత ప్రాంతాల్లోనో, సముద్రంలోనో విడవడం విమానాలకు అలవాటు. కానీ విమానాశ్రయం సమీపించే సమయంలో అలా వదలటం అంటే అది రాంగ్ టైమ్ లో చేసిన పని అన్నమాట. 
 
ఇళ్లమీద మానవ వ్యర్థ పదార్థాలు పడుతున్న ఘటనలకు సంబంధించిన రిపోర్టులును గతంలో కూడా జోర్జాన్ విమానయాన అధారిటి స్వీకరించింది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో ఆరోపణ చేస్తున్నా వారు చెప్పగలిగితే మా రాడార్ వ్యవస్థను తిరిగి ప్లే చేసి ఆ సమయంలో ఆ స్థలంలో విమానం పైన ఎగురిందీ లేనిదీ తెలుసుకుని తగు చర్య తీసుకుంటామని విమానయాన సంస్థ చెప్పింది. కానీ కిందపడిన వ్యర్థాలను ఎలా క్లీన్ చేసుకోవాలనే సలహా సూచన తాము ఇవ్వలేమని చెప్పడం కొసమెరుపు.