పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన
పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మరణించినట్టు వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ అధికారికంగా ప్రటించారు. పోప్ తన జీవితమంతా చర్చి సేవకు అంకితమయ్యారని ఆయన వెల్లడించారు. పోప్ ఫ్రాన్సిస్ వయసు 88 యేళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు.
అయితే, ఆయన ఎంతగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన అధికారికంగా పాల్గొన్న చివరి కార్యక్రమం ఇదేకావడం గమనార్హం. పోన్ మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.