1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (13:49 IST)

మా పనిలో స్వేచ్ఛనివ్వండి... సెక్స్‌వర్కర్ల ఆందోళన

చాలా దేశాల్లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేశారు. ఈ నేపథ్యంలో సెక్స్‌ను నేరంగా పరిగణించరాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. కార్మికుల పనుల్లాగా తమ పని కూడా పనేనని, తాము కూడా కార్మికులలాంటి వారిమేనని, తమకు రౌడీలు, గూండాల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని సెక్స్‌వర్కర్లు ఆందోళనకు దిగారు. కస్టమర్లతో బహిరంగంగా బేరమాడుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
మైనర్ల అక్రమ రవాణాను నిరోధించి, వ్యభిచారానికి వారిని వినియోగించుకునే తీరుకు అడ్డుకట్ట వేయాలని, సేఫ్ సెక్స్ గురించి ‘కస్టమర్ల’తో బహిరంగంగా ‘ఒప్పందాలు’ కుదుర్చుకునే వెసులుబాటును ప్రాస్టిట్యూట్స్‌కు ఇవ్వాలని అంటున్నారు. అయితే ఈ వాదనను వ్యతిరేకించేవాళ్లూ వున్నారు. దీనిపై వున్న ఆంక్షలను తొలగిస్తే చాలామంది వ్యభిచారం రొంపిలోకి దిగుతారని, పైగా వేశ్యలకు బదులు విటులు, తార్పుడుగాళ్లు లాభపడతారని వారంటున్నారు. 
 
పైగా ఇది సెక్స్ టూరిజంను పెంచుతుంది, మనుషుల అక్రమరవాణా మరింత పెరుగుతుంది.. అని వాళ్లు అభిప్రాయ పడుతున్నారు. వ్యభిచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా 186 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని, 40-42 మిలియన్ల మంది ఈ రొంపిలో వున్నారని లెక్కలు చెబుతున్నాయి.