శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2022 (21:33 IST)

తాలిబన్ల మీద తిరగబడుతున్న జనం, రణరంగం తప్పదేమో?

protest
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు తమ రాజ్యాన్ని అయితే నెలకొల్పారు. కానీ ప్రజలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు వారు చేస్తున్న యత్నాలు విఫలయత్నాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన దగ్గర్నుంచి ఎన్నో మార్పులు, చట్ట సవరణలు, ఆంక్షలు పెడుతూ వెళ్తున్నారు.

 
ఈ నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పలుచోట్ల పౌరులు రోడ్లెక్కి తాలిబన్ ప్రభత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా అక్కడ పరిస్థితి మాత్రం మారలేదు. ప్రభుత్వంతో ప్రజలు విబేధిస్తున్నారు. మరి ఈ ఆందోళనలు ఎంతదూరం వెళ్తాయో చూడాలి.