శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (09:32 IST)

పైలట్‌కు గుండెపోటు.. గాల్లో ప్రయాణికుల ప్రాణాలు... తర్వాత ఏమైంది?

కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణికిపోయారు.

కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణికిపోయారు. 
 
అనేక మంది ప్రయాణికులు తమకిదే చివరి రోజని భావించి తమతమ ఇష్టదైవాలను ప్రార్థించారు. అయితే, ప్రయాణికులు ప్రాణాలు ప్రార్థనలు ఫలించడంతో విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో పైలట్‌ ఒక్కసారిగా గుండెపోటుకు వచ్చింది. ఈ విషయాన్ని విమాన ప్రయాణికులకు తెలిపి... అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించాడు. 
 
వారు తక్షణం అనుమతి ఇవ్వడంతో విమనాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న 225 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు.