సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (10:29 IST)

12న క్వాడ్ సమ్మిట్: ఒకే వేదికపైకి నరేంద్ర మోడీ - జోబైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న చతుర్భుజి కూటమి(క్వాడ్​) దేశాల వర్చువల్​ సమ్మిట్​లో వీరిద్దరూ పాల్గొననున్నారు. 
 
ఈ నెల 12వ తేదీ సమావేశంకానున్న చతుర్భుజ కూటమి(క్వాడ్​) వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తొలిసారిగా క్వాడ్​ సభ్యదేశాల అధినేతలు పాల్గొననున్నారు. భారత్​ ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా,​ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ క్వాడ్​ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. 
 
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక జో బైడెన్​, ప్రధాని మోడీ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో తమ సహకారాన్ని విస్తరించే దిశగా చర్చలు జరిగే అవకాశముందని విదేశాంగ శాఖ తెలిపింది. 
 
వీటితో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సరఫరా గొలుసు, సాంకేతికత, సముద్ర భద్రత, వాతావరణ మార్పులపై మాట్లాడే అవకాశముందని వెల్లడించింది.