శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (11:51 IST)

నలుగురు భారతీయులను తొలగించి ఒక అమెరికన్‌ను ఉద్యోగమిస్తున్న ఐటీ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలోని ఐటి కంపెనీలు వణికిపోతున్నాయి. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలోని ఐటి కంపెనీలు వణికిపోతున్నాయి. దేశాధ్యక్షుడి హోదాలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం ఒక్క అమెరికా పౌరుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నలుగురు భారతీయ ఉద్యోగులను తొలగించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. 
 
డోనాల్డ్ ట్రంప్ మాట వినకుంటే అమెరికా నుంచి ఆర్డర్లు తెచ్చుకునే సంస్థలకు, ఇచ్చిన సంస్థలకు బార్డర్ ట్యాక్స్ పేరుతో భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉండటంతో పాటు అమెరికాలో ఉన్న తమ సంస్థలు, అందులోని ఉద్యోగులను ఇబ్బందులు పెడతారని ఐటీ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో తలనొప్పులు ఎందుకని భావించిన సంస్థలు భారతీయుల కంటే నలుగురు భారతీయులను తొలగించైనా సరే ఒక అమెరికన్‌కు ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం భారత్ ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 
 
భారతీయ ఉద్యోగులను తొలగించే కంపెనీల జాబితాలో కాగ్నిజెంట్ ముందు వరుసలో ఉంది. బలవంతపు వీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగులను ఇంటికి పంపే చర్యలు చేపట్టింది. అలాగే, విప్రో, ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు కూడా ఇదేబాటలో నడిచేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్ విధానం కూడా ఉద్యోగులకు ప్రతికూలంగా మారింది. మానవవనరుల స్థానంలో రోబోలు సగం పనిని పూర్తి చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఐటి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి.