బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (18:55 IST)

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

Lottery
లాటరీలో అతడికి ఏకంగా 287 కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా అతడు ఓ మామూలు రైతు. కూలి పనులు చేసుకునే రైతుని ఒక్కసారిగా ధనలక్ష్మి కరుణించడంతో కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంకా తనకు వున్న కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాడు. ఇంతలో అతడిని ఎన్నాళ్లుగానో వేధిస్తున్న పంటినొప్పి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరిపోయాడు.
 
అక్కడ వైద్యులు అతడికి ఆపరేషన్ చేస్తుండగా అనూహ్యంగా మృతి చెందాడు. లాటరీలో తగిలిన డబ్బును అప్పజెప్పేందుకు పోలీసు బందోబస్తు అతడిని వెతుక్కుంటూ రాగా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడి గురించి వాకబు చేయగా శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కోట్ల రూపాయలు వచ్చినా వాటిని అనుభవించేలోపే అతడు మృత్యువాత పడటంతో అక్కడ విషాదం అలముకుంది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.