Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాలకు చెక్.. 18 దేశాలకు వీసాలొద్దు.. రష్యా ప్రకటన

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:57 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యవహారంపై ప్రపంచ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వీసాల జారీ విషయంలో భారతీయులకు ట్రంప్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పద్ధతిలోనే సింగపూర్ కూడా భారతీయులకు షాకిచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో పనిచేసేందుకు వీలుగా ప్రతి ఏడాది 95వేల వీసాలు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది.
 
స్థానికులకు ఉద్యోగం ఇవ్వడం ద్వారా నిరుద్యోగానికి బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల విషయంలో మాత్రం ఆస్ట్రేలియన్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో 457 వీసాను రద్దు చేస్తున్నామని ఆసీస్ ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్ తెలిపారు. ఇలా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలు విదేశీయుల వీసా విషయంలో స్థానికత పేరుతో షాకిస్తే.. రష్యా మాత్రం భారతీయులకు అండగా నిలిచింది. 
 
ఈ మేరకు రష్యా దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు వీసా అక్కర్లేదని ఆ దేశ ప్రధాన మంత్రి మెద్వెదేవ్ ప్రకటించారు. కేవలం, భారత్‌కే కాకుండా మరో 18 దేశాలకు ఈ అవకాశం కల్పించినట్లు మెద్వెదేవ్ వెల్లడించారు. వీసా అవసరం లేకుండా రష్యాలో పర్యటించేందుకు అనుమతించిన దేశాల్లో భారత్, యూఏఈ, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనె, కువైట్, ఇరాన్, ఖతార్, చైనా, ఉత్తరకొరియా, సింగపూర్, ట్యునీషియా, టర్కీ, జపాన్, మొరాకో, మెక్సికో, ఒమన్, సౌదీ అరేబియా దేశాలున్నాయి. తూర్పు రష్యాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పర్యాటక రంగ ఆదాయం పెంచుకునే ఉద్దేశంతోనే రష్యా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎల్కే.అద్వానీ - జోషి- ఉమలు కుట్రదారులే : బాబ్రీ కేసు పునర్విచారణకు సుప్రీంకోర్టు ఒకే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండున్నర ...

news

దినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ కూలుతుందా?

తమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం ...

news

దినకరన్ ఏజెంట్ సుకేష్ మామూలోడు కాదు... అమ్మాయిలు సరఫరా... కన్నడ నటి లీనాతో సహజీవనం...

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ ...

news

జయమ్మ ఆత్మే అంతా చేసింది.. చిన్నమ్మకు చుక్కలు చూపించింది.. పన్నీరుకు పక్కన నిలిచింది..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ...

Widgets Magazine