మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (16:26 IST)

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం - వోడ్కాకు వచ్చిన కష్టాలు

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇది ఐదో రోజుకు చేరుకుంది. చిన్నదేశమైనప్పటికీ ఉక్రెయిన్ సైనికులు రష్యా సైనిక బలగాలకు ఏమాత్రం లొంగడం లేదు. రష్యా సైనికులు జరుపుతున్న దాడులకు ధీటుగా ఉక్రెయిన్ సైన్యం, ప్రజలు ధీటుగా జవాబిస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో మందుబాబులకు అత్యంత ప్రియమైన బ్రాండ్‌గా ఉన్న రష్యా వోడ్కాకు ఇపుడు ఎక్కడలేని కష్టాలు వచ్చాయి. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పిరిట్‌పై కెనడా, అమెరికా పలు రాష్ట్రాల్లో నిషేధం విధించాయి. ఇప్పటికే ఆయా స్టోర్లలోని రష్యన్ ఉత్పత్తులు, రష్యన్ బ్రాండ్ స్పిరిట్‌లను తొలగించాలని నిర్ణయించాయి.
 
అమెరికాలోని న్యూ హ్యాంప్‌షేర్, ఓహియో రాష్ట్రాలు రష్యాలో తయారైన రష్యన్ బ్రాండ్ స్పిరిట్‌లను అమ్మకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు హాంప్‌షేర్ గవర్నర్ క్రిస్ సునును ప్రకటించారు. రష్యన్ స్టాండర్డ్ వోడ్కాపై నిషేధం విధిస్తున్నట్టు వారు ప్రకటించారు. ఓహియోలోని 487 లిక్కర్ ఏజెన్సీలలో రష్యన్ మేడ్ హోడ్కా బాటిళ్లు 6400 ఉన్నాయని, ఆయా స్టోర్ల నుంచి వాటిని తొలగించాలని ఆదేశించామని గవర్నర్  మైక్ డివైన్ వెల్లడించారు.