సౌదీలో నరకం అనుభవించా.. 14 సంవత్సరాల తర్వాత విముక్తి..

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:43 IST)

saudi arabia

సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఉడిపి ప్రాంతానికి చెందిన 42 ఏల్ల జసింత మెండోనికాను ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికింది. 
 
కానీ సౌదీ అరేబియాలో యంబు ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. మెండోనికా పనిచేసే ఇంటి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించింది. వాటిని తాళలేక మెండోనికా గత ఏడాది నవంబరులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ అధికారులు ఆమెను పట్టుకుని మళ్లీ యజమాని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మెండోనికా పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోయింది. 
 
ఎంత బతిమలాడుకున్నా కానీ ఆమెకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. ఎట్టకేలకు మెండోనికాను 14 నెలల తర్వాత మానవహక్కుల పరిరక్షణ సంస్థ సిబ్బంది కాపాడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడు దాటితే మృత్యువే... ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మధ్యాహ్నం పూటే జరుగుతున్నాయని కేంద్ర ...

news

జర్మనీ చాన్స్‌లర్‌గా ఏంజిలా మెర్కెల్‌‌కే ఛాన్సెస్...

ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ...

news

హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు...

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 ...

news

రెండేళ్ళుగా కన్నతండ్రే కాటేస్తున్నాడు...

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లి ...