బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (21:19 IST)

టైటానిక్ షిప్‌‌లా సముద్రంలో మునిగిన జపాన్ ఓడ

Japan ship
టైటానిక్ షిప్‌ సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ షిప్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి తయారు చేశారు. అప్పట్లో ఇది లగ్జరియస్ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొనడం వలన రెండు ముక్కలయ్యి సముద్రంలో మునిగిపోయింది. 
 
ఇక ఇదిలా ఉంటే, జపాన్ సముద్ర తీరంలో 39,910 టన్నుల బరువైన ఓ భారీ రవాణా షిప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తరువాత ఆ షిప్‌లోని ఆయిల్ కొంతమేర లీక్ అయింది. వెంటనే జపాన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి షిప్ నుంచి ఆయిల్ కాకుండా సరిచేశారు. 
 
అయితే, భారీ కలప లోడ్ తీసుకొని వెళ్తున్న ఈ షిప్ ప్రతికూల వాతావరణం కారణంగా విరిగిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వం పేర్కొన్నది.