శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (14:34 IST)

కన్నతల్లిని గొంతుకోసి హత్య- ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు..

murder
కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌లో జూలై 10న ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
అజ్ఞాత వ్యక్తి కాల్‌తో విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానంతో కాలువలో గాలించగా.. ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది. దాన్ని బయటకు తీసి ఓపెన్ చేయగా అందులో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. 
 
గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందు బాధితురాలి కొడుకును అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అతనిని అరెస్ట్ చేసారు.